దివ్యాంగుల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరిస్తాం..

జనగామ (CLiC2NEWS):  దివ్యాంగుల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు తో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుండి 76 విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి పరిష్కరిస్తామని, అర్హులకు న్యాయం చేకూరుస్తామన్నారు.
ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ లు భాస్కర్ రావు , అబ్దుల్ హమీద్, జడ్పి సి.ఈ.ఓ.విజయలక్ష్మి, డి.ఆర్.డి.ఏ. పీడీ రాంరెడ్డి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కిసాన్ పధకం లబ్ది దారుల బ్యాంక్ ఖాతా లకు ఆధార్ నెంబర్ ను జతపర్చేందుకు చర్యలు.

ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద లబ్ధిదారులకు వారి ఆధార్ నంబర్‌లను సంబంధిత బ్యాంక్ ఖాతా నంబర్‌లకు లింక్ చేయించాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

భారత ప్రభుత్వం PMKISAN పథకం కింద లబ్ధిదారులకు చెల్లింపును మార్చినందున, వారి ఆధార్ నంబర్‌లను సంబంధిత బ్యాంక్ ఖాతా నంబర్‌లకు లింక్ చేయించాలన్నారు. అందుకు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌ల సహకారంతో గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.