చంద్రుడిపై ప‌రిశోధ‌న‌ల కోసం జ‌పాన్‌తో జ‌ట్టు

Chandrayaan-5: చంద్రుడిపై ప‌రిశోధ‌న‌ల నిమిత్తం భార‌త్ కీల‌క భాగ‌స్వామ్యాన్ని కుదుర్చుకుంది. చంద్రయాన్ -5 కోసం జ‌పాన్‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వెల్ల‌డించారు.  చంద్ర‌యాన్‌-5 కోసం భార‌త్‌-జ‌పాన్ దేశ అంత‌రిక్ష సంస్థ‌లు క‌లిసి ప‌నిచేయ‌నున్నాయి. ఈ మిష‌న్ ద్వారా చంద్రుడి ఉప‌రిత‌లం, ప‌ర్యావ‌ర‌ణ‌పై శాస్త్రీయ అవ‌గాహ‌న‌ను పెంచుతుంద‌ని భావిస్తున్నారు.  మ‌రోవైపు చంద్రయాన్-5 మిష‌న్‌కు కొన్ని నెల‌ల క్రితం కేంద్రం ఆమోదం తెలిపింద‌ని ఇస్రో ఛైర్మ‌న్ తెలిపారు. దీనికి జ‌పాన్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ద్వారా అత్యాధునిక సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకునే వీలుక‌లుగుతుంది. 2023లో చంద్ర‌యాన్‌-3 ద్వారా 25 కిలోల ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌ను చంద్రుడిపై దించ‌గా.. చంద్రయాన్ -5 ద్వారా 250 కిలోల రోవ‌ర్‌ను చంద్రుడి ఉప‌రిత‌లంపై ల్యాండ్ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. 2027లో చంద్ర‌యాన్ -4 మిష‌న్‌ ను చంద్రుడి నుండి న‌మూనాల‌ను భూమికి ర‌ప్పించేందుకు ప్ర‌యోగించ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Also Read: మా అదృష్టాన్ని భార‌త ప్ర‌జ‌ల‌తో పంచుకోవాల‌నుకుంటున్నాం..

Leave A Reply

Your email address will not be published.