పిజి మెడిక‌ల్ సీట్ల భ‌ర్తీ.. జ‌న‌వ‌రి 25 నుండి వెబ్ కౌన్సెలింగ్‌..

వ‌రంగ‌ల్‌ (CLiC2NEWS): ఈనెల 25 వ తేదీనుండి 27 వ‌ర‌కు పిజి మెడిక‌ల్ సీట్ల భ‌ర్తీ కొర‌కు వెబ్ ఆప్ష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కాళోజి హెల్త్ యూనివ‌ర్సిటీ తెలిపింది. ఈ మేర‌కు హెల్త్ యూనివ‌ర్సిటీ మొద‌టి విడ‌త ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కాళోజి ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని క‌ళాశాల‌ల‌కు, నిమ్స్‌ మెడిక‌ల్ క‌ళాశాల‌లోని క‌న్వీన‌ర్ కోటా సీట్ల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. సీట్ల ఖాళీల వివ‌రాల‌ను యూనివ‌ర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. జ‌న‌వ‌రి 25వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుండి 27 వ‌తేదీ మ‌ధ్యాహ‌నం 2 గంట‌ల వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.