Weekend Lockdownను పరిశీలిస్తాం: సిఎస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరమైనప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
లాక్డౌన్ కంటే మంచి చికిత్సను అందించడం ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని సిఎస్ పేర్కొన్నారు.