పింఛన్‌దారుల సొమ్ముతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్

నందిగామ (CLiC2NEWS): పింఛన్ దారులకు అందజేయాల్సిన సొమ్ముతో వెల్ఫేర్ అసిస్టెంట్ పరారయ్యాడు. ఈ ఘటన ఎన్‌టిఆర్ జిల్లాలోని కంచికచర్లలో చోటుచేసుకుంది. గంపల గూడెం మండలం పెనుగోలనుకు చెందిన తోట తరుణ్ కుమార్ గత 6 నెలలుగా కంచకచర్ల పట్టణంలో సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మంగళవారం పింఛన్ దారులకు అందజేయాల్సి సొమ్ము రూ. 7.55లక్షలతో తరుణ్ కుమార్ రాలేదు. అతని ఫోన్ కడా స్విచ్ఛాప్ వస్తుంది. తరుణ్ కుమార్ స్వగ్రామం పెనుగోలనులో ఉన్న ఇంటికి కూడా ఫోన్ చేయగా.. స్పందించలేదు. దీంతో అనుమాన వచ్చిన మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపిడిఒ) లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.