బిజెపి ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన బెంగాల్ సిఎం మమతా..

కోల్‌కతా (CLiC2NEWS): పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జి .. బిజెపి ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. బంగ్లాదేశ్ ఛాందస వాదులతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని మంగళవారం అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఆమె బిజెపి తీరుపై విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ ఛాందస వాదులతో చేతులు కలిపారంటూ బిజెపి ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
బిజెపి ఎమ్మెల్యేలు సభలో నన్ను ఎదుర్కునేందుకు భయపడుతున్నారని, అందుకే తాను మాట్లాడుతున్నప్పుడు బాయ్‌కాట్ చేసి వెళ్లిపోతున్నారన్నారు. అసెంబ్లీలో మాట్లాడడానికి అనుమతించడంలేదని బిజెపి ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారు. విద్యేషాలను వ్యాప్తి చేయడానికి , ప్రజల్ని విభజించడానికి వారికి వాక్ స్వాతంత్య్రం అనుమతించదు. నేను జాతీయ భద్రత లేదా విదేశాంగ విధానం వంటి అంశాల జోలికి వెళ్లను.. కానీ , అమెరికా నుండి అక్రమ వలసదారుల్ని గొలుసులతో బంధించి వెనక్కి పంపించడం సిగ్గుచేటు. వారిని అమెరికా నుండి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విమానాలు పంపాలని మమత అన్నారు.