ప్రకృతి ఇచ్చిన గొప్ప ఔషధం `గోధుమ గడ్డి రసం`
దక్షిణ భారతదేశంలో వరి ఎలా పండుతుందో, ఉత్తర భారతదేశంలో గోధుమలు పుష్కలంగా అలానే పండిస్తారు. గోధుమలతో ఎన్నో రకాల వంటలు తయారుచేస్తారు. అసలు ఒక విషయం నిజంగా చెప్పాలంటే గోధుమలు రోగులకు, ఆరోగ్యవంతులకు, పిల్లలకు, కూడా బలమైన ఆహారం. మంచి ఇమ్మ్యూనిటీని ఇస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అలానే గోధుమ నారు రసం ఒక ప్రత్యేకమైన ఔషధం.. దీనిని డాక్టర్స్ అందరు `అమృత` రసమని అంటారు. గోధుమ నారు రసం చాలా జబ్బులను తగ్గించే గుణం ఉంది. కేన్సర్ వ్యాధిని కూడా కట్టడి చేస్తుంది. హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. గోధుమ నారు `సర్వరోగనివారిని`గా కూడా పనిచేస్తుంది. శరీరాన్ని పునర్నిమాణం చేస్తుంది. దీనిలో ఉన్న పోషక తత్వాలు ఎంతోగాను ఉపయోగపడుతాయి.
క్లోరోఫీల్ అంశాలు అన్ని మొక్కల్లో ఉంటాయి. కానీ గోధుమనారులో వుండే క్లోరోఫీల్ మాత్రం చాలా విశిష్టమైనది. ఇది మానవ రక్తంలో నలభై శాతం కలుస్తుంది. దీని నుండి లభించే క్లోరోఫీల్ ని `గ్రీన్ బ్లడ్` అని కూడా అంటారు. గోధుమనారు రసం ప్రతిరోజు తాగేవారికి ఉత్తమ పోషక పదార్థాలు లభిస్తాయి. శరీరంలో రోగకారక బలహీనతకు లోను చేసే కణాలు నశించి, వాటి స్థానంలో కొత్త కణజాల నిర్మాణం జరుగుతుంది. శారీరక శక్తి ఎంత ప్రభలంగా ఉంటుందంటే, రోగకారక, విష క్రిములు అన్నింటిని అది నాశనం చేస్తుంది. గోధుమ నారు పోషక తత్వాలతో నిండిన వనస్పతి, ఇది శరీరాన్ని రోగరహితం చేస్తుంది.
గోధుమనారు తయారు చేయు విధానం…
మనం ఇళ్లలో ఖాళీ ప్రదేశంలో ఒక తొమ్మిది చిన్న పూల కుండీలు ఉంచండి. దానిలో ఇసుక, మట్టి, కొద్దిగా సేంద్రియ ఎరువు కలిపి కుండీలో వేయండి. ఆలా తొమ్మిది కుండీలలో వేసి ఉంచాలి.
తరువాత చేతితో గుప్పెడు గోధుమలు తీసుకొని వాటిని ఒక గ్లాస్ నీటిలో సాయంత్రం నానా పెట్టాలి. ఉదయం వీటిని నీటిలో నుండి తీసి ఒక కుండీలో గోదుమలను వేయాలి. కనీసం ఒక అంగుళం లోతుగా ఉన్నట్లు గోధుమలు వేయాలి, దాని మీద కొద్దిగా మట్టి సేంద్రియ ఎరువు వేసి నీళ్లు కొద్దిగా చల్లాలి. ఇలా తొమ్మిరోజులు చేస్తూ, తొమ్మిది కుండీలలో వేయాలి. 10వ రోజు, మొదటి రోజు వేసిన కుండీలో గోధుమలు నారు పెద్దగా అవుతాయి. వాటిని చక్కగా వేళ్ళతో పీకాలి. పీకిన కుండీలో మరల నాన పెట్టిన గోధుమలు దానిలో వేయాలి, ఇలా నారు తీసిన కుండీలలో, నాన పెట్టిన గోధుమలు వేస్తూనే ఉండాలి.తరువాత వేళ్ళు కత్తిరించి పారేయాలి, మిగతాది శుభ్రంగా నీటిలో కడిగి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకునేటప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి జ్యూస్ చేసుకోవచ్చును. కొద్దిగా తేనే కలపచ్చును.. కానీ నిమ్మరసం మాత్రం కలపరాదు..లేదా డైరెక్టుగా జ్యూస్ నే పరిగడుపున తాగాలి. మొదట్లో మినిమం 30 గ్రాములు తాగాలి. మినిమం 50 గ్రాములు దాటకూడదు. ఇది తయారుచేసిన గంట లోపే తాగాలి. ఒకవేళ ఎక్కువగా జ్యూస్ ఉంటే ఫ్రీజ్ లో పెట్టుకొని మరుసటి రోజు తాగవచ్చును.
కొత్తలో జ్యూస్ తాగితే వాంతులు, విరోచనాలు, జ్వరం రావచ్చును. దీని వలన బయపడవల్సిన అవసరం లేదు. దీని తాగటం వలన లోపల ఉన్న విష కారకాలు బయటికి వాంతులు రూపంలో వస్తాయి. తరువాత అలవాటు పడుతుంది.
ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలో రెండు సార్లు అయినా తాగాలి.
దీనిని తాగటం వలన కీళ్ళ నొప్పులు, మధుమేహం, కాన్సర్, పక్షవాతం, ఆయాసం, రక్త దోషాలు, టీబి, శుక్లాలు, బట్టతల, జుట్టు తెల్లబడటం, జీర్ణ రోగాలు నయం అవుతాయి.
హెచ్చరిక: గోధుమ నారు రసం తాగే రోజుల్లో వేపుడు పదార్దాలు, రోడ్డు side దొరికే ఫుడ్, మరియు ఆయిల్ food, మాంసం తినరాదు.
-షేక్. బహార్ అలీ.
ఆయుర్వేద వైద్యుడు