పదేళ్లలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యి తీరుతా…
ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు!

సంగారెడ్డి (CLiC2NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో దసరా సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. ఈ ఉద్సవాల్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. “ దసరా ఉత్సవాల్లో విజయ దశమి నాడు నా మనసులో మాట మీతో చెబుతున్నాను.. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి.. దీనిని ఎవరైనా కాదన గలరా?“ అని ఆయన ప్రశ్నించారు.
తాను రానున్న పదేళ్లలో తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. నన్ను మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని జగ్గారెడ్డి అక్కడి ప్రజలకు స్పష్టం చేశారు.
ఇంకా
“ మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్‌ను చేసిండ్రు..
మీరు నన్ను మున్సిపల్ చైర్మన్ ను చేసిండ్రు..
మీ ఆశీర్వాదం తో నేడు ఇప్పటి మూడుసార్లు ఎమ్మెల్యేను అయ్యా..
ఈ పదేళ్లు నేను సిఎం అయ్యే వరకు కాపాడుకోండి..
ఈ విజయ దశమి రోజు నా మనసులో మాట చెబుతున్నా…
ఆశీర్వదించండి“
అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే కాంగ్రెస్‌లో నేను కాబోయే ముఖ్యమంత్రి అంటూ పలువురు సినియర్లు పేర్కొన్న విషయం తెలిసిందే.. తాజాగా వారి కాంగ్రెస్‌లో “నేనే సిఎం“ అనే వారి లిస్టులో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చేరిపోయాడు.. అంటూ పలువురు చర్చింకుచుంటున్నారు.