వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!
వికారాబాద్ (CLiC2NEWS): పట్టణంలో ఓ మహిళా కానిస్టేబుల్ దివ్య (28) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. కోటపల్లి పోలీసు ఠాణాలో విధులు నిర్వహిస్తూ… దారూర్ సిఐ ఆఫీసుకు అటాచ్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు గల కారణకు తెలియాల్సి ఉంది.
Alos Read: Bhadrachalam: రేపటి నుంచి `జై శ్రీరామ్` ఇటుకల విక్రయం