మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: స్వాతిలక్రా
గద్వాల (CLiC2NEWS): మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని అదనపు డిజిపి, ఉమెన్ సేఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మహిళ రక్షణ కోసం సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. చట్టాలపై మహిళలకు అవగామన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జిల్లా జడ్పీ ఛైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.