Hyd: ఆగ‌స్టు 5 నుండి తెరుచుకోనున్న `వండ‌ర్ లా`

హైదరాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని వండ‌ర్ లా పార్క్ ఆగ‌స్టు 5 తిరిగి తెరుచుకోనుంది. అన్ని వయస్సుల వారికి రూ.799 (జీఎస్‌టీతో స‌హా) పరిమిత ఆఫర్‌తో పార్క్‌లోని అన్ని వ‌స‌తులు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ పార్క్ గురువారం నుండి ఆదివారం వరకు ఉదయం 11 గంట‌ల నుండి తెరిచి ఉంటుంది. ప‌ర్యాట‌కులు, సంద‌ర్శ‌కులు ఎంట్రీ టికెట్ల కోసం bookings.wonderla.com సైట్లో ఆన్‌లైన్ బుక్ చేసుకోవ‌చ్చు. కాగా కొవిడ్ నిబంధ‌న‌ల్లో భాగంగా ఈ పార్క్ 50 శాతం సామ‌ర్థ్యంతో ప‌నిచేయ‌నుంది. సంద‌ర్శ‌కుల‌ను ఆహ్వానించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.