హైదరాబాద్ మహానగరానికి ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్’: మంత్రి కెటిఆర్ ప్రశంస
![](https://clic2news.com/wp-content/uploads/2022/10/outer-ring-road-in-hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. దక్షిణ కొరియాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హర్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా హెచ్ ఎండిఎపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంసలు కురిపించారు. లివింగ్ గ్రీన్ కేటగిరి కింద.. ఓఆర్ ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) చుట్టూ ఉన్న గ్రీనరీకి వరల్డ్ గ్రీన్ సిటి అవార్డు వరించింది. భారత్ నుండి ఈ అవార్డు దక్కించుకున్న ఒకే ఒక్కసిటీ హైదరాబాద్ . ఇంటర్నేషనల్ అవార్డు రావడానికి సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హారితహారంతో పాటు పచ్చదనం పెంపునకు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలే ప్రధాన కారణమని మంత్రి కెటిఆర్ అన్నారు.