జ‌ల‌మండ‌లిలో ఘ‌నంగా ప్ర‌పంచ నీటి దినోత్స‌వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌పంచ నీటి దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.
నీరు, పారిశుద్ధ్యంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్పును వేగవంతం చేయుట” అనే ప్రధానాంశంతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎండీ దానకిశోర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నీటి సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే పొదుపుగా నీటి వాడ‌కంతో పాటు శుద్ధి చేసిన నీరు పునర్వియోగం చేయాలన్నారు.
దేశంలో తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రమని, అయినప్పటికీ.. ప్రతి ఇంటికీ తాగు నీరందించిన తొలి రాష్ట్రంగా ఘనతను సొంతం చేసుకుందన్నారు. సీఎం కేసీఆర్‌, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ల సార‌థ్యం, కృషి వ‌ల్లే ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్ మహా నగరంలో 99.16 శాతం మంది ప్ర‌జ‌లు జ‌ల‌మండ‌లి స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటిని వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ జులై నాటికి దేశంలోనే వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్ప‌టికే జ‌ల‌మండ‌లికి వాట‌ర్ డైజెస్ట్ మ్యాగ‌జైన్ ప్ర‌భుత్వ విభాగంలో ఉత్తమ ఎస్టీపీ అవార్డు ఇచ్చింద‌ని, ఆ అవార్డును అందిస్తూ కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావ‌త్ ప్ర‌శంసించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ ఘనత సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

సుంకిశాల పూర్త‌యితే 40 ఏళ్ల వ‌ర‌కు ఢోకా ఉండ‌దు

రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా సుంకిశాల ప్రాజెక్టు చేప‌డుతుంద‌ని.. ఇది పూర్త‌యితే హైద‌రాబాద్ జ‌నాభా మూడింత‌లు పెరిగినా… రానున్న 40 ఏళ్ల వ‌ర‌కు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప‌నులు ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌న్నారు.

రోజుకి 12 వేల శాంపిళ్ల ప‌రీక్ష‌

దేశంలోని ఏ వాట‌ర్ బోర్డు చేయ‌ని విధంగా… జ‌ల‌మండ‌లి రోజూ 12 వేల నీటి శాంపిళ్ల‌ను ప‌రీక్షిస్తుంద‌ని వివ‌రించారు. ఈ ప‌రీక్ష‌లు కూడా వినియోగ‌దారుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌డం విశేష‌మ‌ని తెలిపారు.

అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు

ప్ర‌జ‌ల‌కు నీటి విలువ తెలియ‌జెప్పేందుకు, అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌న్నారు. నీటి వృథాను అరికట్టడంపై 10 రోజుల పాటు అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. ఇందులో పలు ఎన్జీవోలను భాగస్వామ్యం చేయనున్నట్లు వివ‌రించారు. ప్రజలకు నీటి విలువ తెలియజెప్పేలా ప్రచారం చేసేందుకు 2 వాహనాలు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంత‌రం వీటికి సంబంధించిన క‌ర‌ప‌త్రాలు బోర్డు డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. ప్ర‌చార వాహ‌నాల‌ను ఈడీ స‌త్య‌నారాయ‌ణ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం. స‌త్య‌నారాయ‌ణ‌, ఈఎన్సీ, డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్-1 అజ్మీరా కృష్ణ‌, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్ బాబు, రెవెన్యూ డైరెక్ట‌ర్ వీఎల్‌. ప్ర‌వీణ్ కుమార్‌, డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్-2 స్వామి, టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ ర‌వి కుమార్‌, రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ ఓఎస్టీ స‌త్య‌నారాయ‌ణ‌, బ్ర‌హ్మ‌కుమారీలు అంజ‌లి దేవి, దీదీ శోభాదేవి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, ఎన్జీవోల ప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.