Yadadri bhuvanagiri: ట్రాన్స్ జెండర్స్ కోసం హెల్ఫ్ డెస్క్..
భువనగిరి (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలోని సఖి కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డిస్ట్రిక్ వుమెన్ వెల్‌ఫేర్ ఆఫీసర్ శ్రీమతి కృష్ణవేణి ట్రాన్స్ జెండర్ హెల్ఫ్ డెస్క్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ట్రాన్స్ జెండర్స్‌కి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఎంప్లాయిమెంట్ కల్పించుటకు , వారి సమస్యలను పరిష్కారం కొరకు సఖిని ఆశ్రయించవచ్చని తెలిపారు. 181 హెల్ఫలైన్‌ను వినియోగించుకోవచ్చిని అన్నారు.
ఈసందర్భంగా అర్హులైన ట్రాన్స్ జెండర్స్‌కు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సఖి బృందం, ట్రాన్స్ జెండర్స్, బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.