ఖమ్మంలో యోగా శిక్షణ కార్యక్రమం..
ఖమ్మం (CLiC2NEWS): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాచార్యులు షేక్ బహర్ అలీ ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నారై ఫౌండేషన్, మిత్ర ఫౌండేషన్ వాకర్స్ పేరడైజ్ వారి ఆధ్వర్యంలో మరియు ఖమ్మం క్రియేటివ్ హై స్కూల్, ఖమ్మం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో యోగా, ప్రాణయామము ధ్యానము శిక్షణ ఇచ్చారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈరోజు యోగ డే ని నిర్వహించుకోవడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ వారు మరియు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. యోగాచార్యులు షేక్ బహారలికి సత్కరించారు.


