తెలంగాణలో యువత ఓటు నమోదు చేసుకోవాలి: ఇసి సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని యువత ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి కోరారు. జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గత నెల ప్రారంభమైన ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుందిన.. అక్టోబర్ 29న ముసాయిదా జాబితాను ప్రకటించి , నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. జనవరి 6న తుది జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,33,27,304 మంది ఓటర్లు ఉన్నారని.. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఇఆర్ఒలు, ఎఇఆర్ఒలు, బిఎల్ ఒలకు శిక్షణ పూర్తయిందని, ఓటరు కార్డు, ఆధార్ లింక్ దాదాపు 60% పూర్తయిందని తెలిపారు.