ఎపి పోలీసులు కండువా లేని వైఎస్ ఆర్‌సిపి కార్యకర్తలు.. వైఎస్ షర్మిల

అమరావతి (CLiC2NEWS): పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టి అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా అని వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వెఎస్ ఆర్‌సిపి గూండాల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. గూండాలను పక్కన పెట్టుకుని మరీ పోలీసులు దాడులు చేస్తున్నారని.. వాళ్లు పోలీసులా లేక వైఎస్ ఆర్‌సిపి కిరాయి ముషులా అని ప్రశ్నించారు. పోలీసులు కండువా లేని వైఎస్ ఆర్‌సిపి కార్యకర్తలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తన్నడం, గొంతు పిసికి చంపాలని చూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి ఘటనపై డిజిపి వెంటనే స్పందించాలని.. విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.