AP: స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికలకు వైకాపా అభ్యర్థులు ఖరారు

అమరావతి(CLiC2NEWS) : స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సి స్థానాలలో ఇటీవల ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించగా, మిగిలిన 11 ఎమ్మెల్సి స్థానాలకు తాజాగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 14 స్థానాల్లో బిసి, ఎస్సి, మైనార్టిలకు 7 స్థానాలు, ఓసిలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించినట్లు వివరించారు.
చిత్తూరు జిల్లానుండి భరత్, అనంతపురం నుండి వై.శివరామిరెడ్డి, ప్రకాశం నుండి మాధవరావు, గుంటూరు జిల్లా నుండి ఉమమారెడ్డి వెంకటేశ్వర్టు, మురుగుడు హనుమంతరావు, కృష్ణా జిల్లానుండి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా నుండి అనంత బాబు, విశాఖపట్నం నుండి ఒరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్, విజయనగరం జిల్లానుండి రఘురాజు ను సిఎం ఎంపిక చేసినట్టు రామకృష్ణా రెడ్డి తెలిపారు.