Bank of Baroda: విద్యార్థుల కోసం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్
Bank of Baroda: విద్యార్థులకు మినమమ్ బ్యాలెన్స్ లేకుండా సేవింగ్స్ అకౌంట్‌ను తెరిచే అవకాశం కల్పించనుంది . బిఆర్ ఒ పేరిట తీసుకొచ్చిన ఈ ఖాతాను 16 ఏళ్ల నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు బ్యాంకులో ఖాతా తెరవొచ్చు. ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుండానే బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చు. అర్హతను బట్టి జీవిత కాలం ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి రెండు సార్లు కాంప్లిమెంటరి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఉంటుంది. ఇంకా రూ. 2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ఉంటుంది. డీమ్యాట్ ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీల్లో 100 శాతం రాయితీ లభిస్తుంది. విద్యా రుణాలపై జీరో ప్రాసెసింగ్ రుసుముతో పాటు వడ్డీపై కూడా రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా అర్హతను బట్టి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కూడా బ్యాంక్ అందించనుంది.