అంతర్జాతీయ క్రికెట్‌కు శామ్యూల్స్ గుడ్‌బై
జమైకా: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్(39) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్‌ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శామ్యూల్స్ విండీస్ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు. 207 వన్డేలు, 71 టెస్టులు,67 టీ20లు ఆడిన శామ్యూల్స్ అన్ని ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.దీంతో పాటు అన్ని ఫార్మాట్లు కలిపి తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తోనూ 152 వికెట్లు తీశాడు. 2012, 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు.