అపోలో ఆసుప‌త్రిలో చేరిన ర‌జనీకాంత్‌

హైద‌రాబాద్‌: ప‌్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. “రక్త పోటులో హెచ్చు త‌గ్గుల‌ వ‌ల‌న ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు. బీపీని అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ స‌మ‌స్య త‌ప్ప ఇత‌ర ఇబ్బందులు ఏమీ లేవు. ర‌క్త‌పోటు అదుపులోకి రాగానే ర‌జ‌నీకాంద్‌ను డిశ్చార్జి చేస్తాం. ఈ నెల 22న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లోను ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింది“ అని ఆపోలో ఆసుప‌త్రి వైద్యులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అన్నాత్తె షూటింగ్ కోసం కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు ర‌జ‌నీకాంత్. ఇటీవ‌ల అన్నాత్తె చిత్ర బృందంలో 8 మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో షూటింగ్ ఆపేసారు. ర‌జ‌నీకాంత్‌కి నిర్వ‌హించిన ప‌రీక్షలో నెగెటివ్ అని తేలిన ఆయ‌న స్వీయ ‌నిర్భందంలోకి వెళ్ళారు. డిసెంబ‌ర్ 31న ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ గుర్తు, జెండా, అజెండా ప్ర‌క‌టించ‌నున్న త‌రుణంలో ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డం అంద‌రిని ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.