అమెరికా నుంచి భారత్ కు వైద్య సామగ్రి..

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): క‌రోనాపై పోరులో భార‌త్‌కు మ‌ద్ద‌తు కొన‌సాగిస్తామ‌ని అగ్ర‌రాజ్యం అమెరికా ప్ర‌క‌టించింది. భార‌త్‌కు 100 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన వైద్య సామాగ్రిని స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు వైట్ హౌజ్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నాయి. వీటితో పాటుగా అస్త్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు పంపుతోంది అమెరికా.

`ఇప్పుడున్న ప‌రిస్థితులోల్లో భార‌త్‌కు సాయం చేసేందుకు అమెరికా క‌ట్టుబ‌డి ఉంది. కొవిడ్‌కు సంబంధించిన అత్య‌వ‌స‌ర ప‌రిక‌రాలు గురువారం భార‌త్‌కు బ‌య‌లుదేర‌నున్నాయి. 1000 ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, 15 మిలియ‌న్ల ఎన్‌-95 మాస్కులు, 1 మిలియ‌న్ ర్యాపిడ్ కిట్లు పంప‌నున్నాం. 20 మిలియ‌న్ల డోసుల‌కు సంబంధ‌దించి.. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ త‌యారీ స‌మాగ్రిని పంపుతుతున్నాం. క‌రోనాపై పోరులో భాగంగా ఇప్ప‌టికే యుఎస్ ఎయిడ్ కింద 23 మిలియ‌న్ డాల‌ర్ల సాయం అందిస్తున్నాం. అలాగే త‌ర్వ‌లో యుఎస్ ఎయిడ్ కింద త్వ‌ర‌లో 1000 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు అంద‌జేస్తాం“ అని వైట్‌హౌజ్ వెల్ల‌డించింది.
అంతేకాకుండా వైద్య సామాగ్రి స‌ర‌ఫ‌రా చేసేందుకు కొన‌సాగుతున్న ప్ర‌య‌త్నాల్ని అమెరికా ర‌క్ష‌ణ మంత్రి ఆస్టిన్ బుధ‌వారం ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.