అమెరికాలో రోడ్డు ప్రమాదం: 15 మంది దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును మినీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో 15 మంది మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని ఇంపీరియల్ కౌంటీలోని నోరిష్ రోడ్లో ఉదయం యూఎస్వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 14 మంది మృత్యువాతపడగా.. హాస్పిటల్కు తరలించగా ఒకరు మృతి చెందారు. మరో పది మందికిపైగా గాయపడగా హాస్పిటల్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా గాయపడ్డ వారిలో మగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎనిమిది మంది కూర్చోవాల్సిన వాహనంలో సుమారు 27 మంది వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులంతా వ్యవసాయ కూలీలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.