అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌‌ ప్రమాణం

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ జస్టిస్‌ రాబర్ట్స్‌ బైడెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలు) లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం మొదలయ్యింది. ఆ తర్వాత బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ తమ భార్యలతో కలిసి ఈ కార్యక్ర‌మానికి హాజరయ్యారు. అయితే తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ట్రంప్‌ వైఖరి, క్యాపిటల్‌పై ఆయన మద్దతుదారుల దాడి నేపథ్యంలో బైడెన్‌, కమలా ప్రమాణ స్వీకారానికి అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లేడీ గగా జాతీయ గీతం ఆలపించగా , జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో అలరించారు.

Leave A Reply

Your email address will not be published.