అర్ధ‌శ‌త‌కాల‌తో ఆదుకున్న శార్దూల్, సుంద‌ర్

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 336 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత ఆటగాళ్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 67 పరుగులు, వాషింగ్టన్‌ సుందర్‌ 62, రోహిత్‌ శర్మ 44, అగర్వాల్‌ 38 పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు.

ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ లోయర్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ చూపించిన తెగువ‌తో బ్రిస్బేన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా మంచి స్కోరే చేసింది. శార్దూల్ ఠాకూర్(67)‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ (62) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. దీంతో భారీ ఆధిక్యం వ‌స్తుంద‌ని ఆశించిన కంగారూలు కంగుతిన్నారు. చివ‌రికి కేవ‌లం 33 ప‌రుగుల ఆధిక్యంతో స‌రిపెట్టుకున్నారు. ఒక ద‌శ‌లో 186 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన టీమ్‌ను.. శార్దూల్‌, సుంద‌ర్ ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రూ ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగి ఏడో వికెట్‌కు ఏకంగా 123 ప‌రుగులు జోడించ‌డం విశేషం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా తొలి టెస్ట్ ఆడుతున్న సుంద‌ర్.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

Leave A Reply

Your email address will not be published.