అలనాటి నటుడు వడ్లమాని విశ్వనాథం
సినిమారంగంలో వేలమంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దానిలో ప్రముఖపాత్రలు పోషించినవారే నటులుగ గుర్తింపు పొందారు.ఉదాహరణకు, బొడ్డపాటి- నల్లరామ్ముర్తి- సీతారామ్ – జగ్గారావు-త్యాగరాజు-చదలవాడకుటుంబరావు- లంకాసత్యం- డా.శివరామకృష్ణయ్య- కామరాజు.. వంటి పలువురు సినికళాకారులు చరిత్రలో అందరికి అందకుండా మనకుతెలియకుండా వెళ్ళిపోయారు. అటువంటి చిన్నతరహా కళాకారులు వేదికనుండి వెండి తెరకు వెళ్ళిన వారిని పరిచయంచయం చేసే చిన్న ప్రయత్నమిది…
విశ్వనాధంగారు 1912 సం” తూర్పుగోదావరిజిల్లా అమలాపురం తాలూకా నందపూడి అగ్రహారంలో శ్రీవేంకటశాస్త్రీ, శ్రీమతి మహాలక్ష్మమ్మగార్లకు జన్మించారు. తన ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారంవెంకటస్వామి నాయుడు గార్ల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించారు. అదేసంవత్సంలో వింజమూరివెంకట లక్ష్మినరసింహా రావుగారి ద్వారా, పెద్దాపురం విద్యావినోదిని నాటకసంస్ధలొ ప్రవేసించారు. చావలిలక్ష్శినారాయణశాస్త్రి, కేశవరావుకామరాజు, కోఠీశేషగిరిరావు వారిసరసన హరిశ్చంద్ర నాటకంలో లోహితుని పాత్రను పోషిస్తూ నాటక రంగంలో ప్రవేశించారు. అనంతరం కాకినాడ లోని యంగ్ మెన్స్ హేపి క్లబ్ లో చేరి చిన్నికృష్ణుడు, ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, లవుడు మెదలగు బాలపాత్రలు చేయసాగారు. అలా బాలకృష్ణుని మెదలు భక్తరామదాసు వరకు, చిత్ర మెదలుకొని చింతామణి వరకు స్త్రీ పాత్రలతో సమంగా పురుషపాత్రలు ధరిస్తూ వందలాది నాటకాలు నాటి ప్రముఖ నటీ, నటులు అందరి సరసన నటించారు.
అదేకంపెనీలో రేలంగి, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఏ.వి.సుబ్బారావు వీరికి మంచి మిత్రులుగా ఉండేవారు. అనంతరం 1935 వరకు పారుపల్లి సుబ్బారావు. బలిజేపల్లి, సి.యస్.ఆర్.గార్లతో పలునాటకాలు ప్రదర్శించారు. 1937 అనారోగ్యంతో నాటకరంగానికి దూరమై కొంతకాలానికి సినిమా రంగంలో ప్రవేసించారు. జానపద-పౌరాణిక చిత్రాలలో దాదాపువీరు మునిగా, బ్రాహ్మణుడుగా, పండితుడిగా ఎన్నో వందలరకాల పాత్రలు వందల సినిమాలలో కనిపిస్తారు అన్ని అతిథి పాత్రలే! అలా ముపై సంవత్సరాలు వెండితెరపై వెలుగొందారు. 1973 మార్చి18 వతేదిన మద్రాసు రాయపేటలోని వైద్యశాలలో తుదిశ్వాస వదిలారు.
-డా.బెల్లంకొండనాగేశ్వరరావు