Gaddar Film Awards(2025): చిరంజీవికి NTR నేషనల్ అవార్డు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ సినీ అవార్డులను శనివారం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే తమిళ అగ్రనటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజు అవార్డు, సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజకు సి.నా.రె అవార్డు వరించింది.
2025 సంవత్సరానికి సంబంధించిన గద్దర్ సినీ అవార్డులను మార్చి 19న ఉగాది రోజున ప్రదానం చేయనున్నారు.
అవార్డుల వివరాలు
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి
- పైడి జయరాజు అవార్డు – కమల్ హాసన్
- బిఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు – సంగీం శ్రీనివాసరావు
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీదత్
- కెఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డు – ఆర్. నారాయణమూర్తి
- రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు – రమేష్ ప్రసాద్
- సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు – సుద్దాల అశోక్ తేజ
- ఎఎన్నార్ ఫిల్మ్ అవార్డు – జయసుధ
- ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం – దిగ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
- ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం – తండేల్
- ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
- ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్ట్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం – కోర్ట్
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం – మిరాయ్
- ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
- ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
- ఉత్తమ సహాయ నటుడు – శివాజి (దండోరా)
- ఉత్తమ సహాయ నటి – భూమిక (యూపోరియా)
- ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్ (దండోరా)
- ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
- ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ్ రెడ్డి (జిగ్రీస్)
- ఉత్తమ బాల నటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్ ప్లే – అనిల్ రాపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ గేయ రచయిత – నందకిషోర్ ( కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం ఆర్ రాధాకృష్ణన్ (కిష్కంధపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (చాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – వై గోవిందరాజు (అఖండ-2)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ సొనావాని, అజయ్ కుమార్ నంబాల (ఛాంపియన్)
- ఉత్తమ యాక్షన్ కొరియో గ్రాఫర్ – పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
Also Read:Bhadrachalam: రేపటి నుంచి `జై శ్రీరామ్` ఇటుకల విక్రయం

