అలియాభట్‌కు కరోనా

న్యూఢిల్లీ : దేశంలో పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడు బ్యూటీ అలియా భట్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇంట్లో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు అన్ని భద్రతా ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆమె సూచించింది. కాగా.. ప్రస్తుతం అలియా సంజయ్‌ లీలా భన్సాలీ గంగుభాయ్‌ కతియావాడి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ భామ ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తోంది. ట్రిపుల్‌ ఆర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సీత పాత్రలో ఆమె నటిస్తోంది. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి అలియా భట్‌ లుక్‌ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.