అసభ్య‌త పెరిగిపోతోంది.. ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌రం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్ర‌సార‌మ‌య్యే వీడియోల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. `తాండ్‌` వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచార‌ణ‌లో భాగంగా.. సుప్రీంకోర్టు ప‌లు సూచ‌న‌లు చేసింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌, ఒటిటిల్లో సినిమాలు, వీడియోలు చూడ‌టం చాలా సాధార‌ణ‌మైపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్ర‌సారం అవుతున్న వీడియోల‌ను స్క్రీనింగ్ చేయాల్సి అవ‌స‌రం ఉంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా కొన్ని ప్లాట్‌ఫాంల‌లో అసభ్య‌క‌ర‌మైన కంటెంట్ ప్రసార‌మ‌వుతోందని జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం పేర్కొంది.

అమెజాన్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్ వేసిన పిటిష‌న్‌ను ఇశాళ సుప్రీంకోర్టు విచారించింది. అప‌ర్ణా పురోహిత్ ముంద‌స్తు బెయిల్ ను అల‌హాబాద్ కోర్టు కొట్టివేయ‌డంతో ఆమె సుప్రీం కోర్టు ను ఆశ్ర‌యించారు. ఈ విచార‌ణ‌ను కోర్టు రేప‌టికి వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంతో కేంద్రం తాజాగా ప్ర‌క‌టించిన ఒటిటిల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను శుక్ర‌వారం కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తాను కోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.