ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 62 కరోనా కేసులు
హైదరాబాద్: ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. అలాగే వైరస్ బారినపడిన పడిన వారిలో 102 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో వైజాగ్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,485 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 8,80,363 మంది కోలుకున్నారు. మరో 962 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో పారాడి 7,160 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.