ఆక్లాండ్‌లో ఘ‌నంగా అట్ల బ‌తుకమ్మ‌

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఇది ప్రపంచానికే పర్యాటక కేంద్రం. అన్ని దేశాల వారు ఇక్కడ వుంటారు. తెలంగాణ జాగృతి-న్యూజీలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్క‌డి తిరు సుబ్రమణియార్ ఆలయంలో మంగ‌ళ‌వారం నిర్వహించిన బతుకమ్మ (అట్ల బతుకమ్మ) ఉత్సవాల్లో 5వ రోజు భారీగా మహిళలు పాల్గొన్నారు.

ఈ ఉత్సవాలను తెలంగాణ జాగృతి – న్యూజీలాండ్ సంఘం అధ్య‌క్షులు జ్యోతి మ‌ల్లికార్జునరెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్రెట‌రి ప్ర‌స‌న్న గుమ్మ‌డ‌వెళ్లిలు ఘ‌నంగా ప్రారంభించారు. చిన్నా పెద్దలందరూ కూడా అందంగా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. ఉత్సాహంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. సాంప్రదాయ వస్త్రధారణతో అందంగా తయారైన చిన్నారులు, మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.