టి. వేదాంత సూరి: ఆక్లాండ్ లో బతుకమ్మ

ఒకప్పుడు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నేను హైదరాబాద్ లో చదువుకుంటున్న సమయం లో బతుకమ్మ ఆడాలంటే సిగ్గు పడేవారు.. ఎందుకంటే తెలంగాణ కు చెందని వారు చులకనగా చూస్తారని. భయ పడేవారు.. తెలంగాణా పల్లెకు వెళ్లి తనివి తీరా బతుకమ్మ ఆదుకునే వారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశ విదేశాల్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణేతర మహిళలు కూడా ఇందులో పాల్గొనడం విశేషం.. ఆ ఘనత జాగృతి ద్వారా కలువకుంట్ల కవితకు దక్కుతుంది.. ఈ నేపథ్యం లో శుక్రవారం న్యూజిలాండ్ లో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి.
(ఆక్లాండ్ లో బతుకమ్మ సంబరాలుఃఫొటోలు)
ఇక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా లేనందున.. ముందు జాగ్రత్త చర్యగా పరిమిత సంఖ్యలో జరుపుకున్నారు.. ప్రపంచం లో తోలి పొద్దు ఆక్లాండ్ లోనే పొడుస్తుంది.. అదే విధంగా ప్రపంచం లో తోలి సంబరాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వుండాలని అనుకున్నాను.. ఇప్పుడు అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. బతుకమ్మ పండుగ సందర్బంగా ఇక్కడ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితలు, పాటలు చిత్రాలు, ఇతర పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్కరి ఇళ్లల్లో ఒక్కో చోట చేరి ఆదుకోవడానికి ఆతిథ్యం ఇస్తున్నారు.. అందులోను ఇక్కడి ప్రకృతి రమణీయత, పూల సొగసులు మరింత ఆకట్టుకునేలా ఉంటాయి.. దసరా వరకు ఇక్కడ పండుగ వాతావరణమే.. ఇక్కడి కార్యకమాలను జ్యోతి రెడ్డి, సుకృతి, ప్రసన్న తదితరులు సన్నాహాలు చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు.. అందరికి అభినందనలు.