’ఆచార్య’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ అదిరింది
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 152వ చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. శనివారం చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.
ఒక సమస్య కోసం పోరాడుతున్న యోధుడిలా ఈ పోస్టర్‌లో చిరు ఉన్నారు. అలాగే ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ.. కొందరు పేదవారు దీనంగా చూస్తుంటే.. అన్యాయం చేసేవారిని చిరు పై లోకాలకు పంపిస్తున్నట్లుగా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇక మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది.. అరిపించేశాడు. మొత్తంగా చూస్తే.. ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా కొరటాల తెరకెక్కిస్తున్నట్లుగా అర్థం అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. చిరు ఈ సినిమాలో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయధర్మాదాయ శౄఖలో జరిగే అవినీతిపై పోరాడుతారని టాక్.
Here it is ..#Acharya pic.twitter.com/QC9Jxqyy0c
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2020