ఆర్ఆర్ఆర్: రిలీజ్ డేట్ వచ్చేసింది!

చిత్ర‌బృందం అధికారిక ప్ర‌క‌ట‌న‌

హైదరాబాద్‌: ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరెకెక్కిస్తున్న చిత్తం `ఆర్ఆర్ఆర్`. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్ర బృందం అభిమానుల‌తో పంచుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్‌పై దూసుకుపోతుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ స‌న్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భీం, రామ‌రాజులు ల‌క్ష్య సాధ‌న కోసం చేసే ఫైట్ సినిమాకే హైలైట్‌గా మారనుంద‌ని టాక్. చిత్ర షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ టీం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టింది. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, ఎన్టీయార్ కొమురం భీమ్ పాత్రలోనూ కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.