ఆర్ఆర్‌ఆర్: ఎన్టీఆర్ ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే!

ద‌ర్శ‌క ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్‌ఆర్. ఈ చిత్రంలో ఎన్టీయార్‌, రామ్‌చరణ్‌లు న‌టి్స్తున్న విష‌యం తెలిసిందే.. ఈ మూవీలో కొమరమ్‌ భీమ్‌ పాత్రలో ఎన్టీఆయర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సీతారామారాజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఎన్టీయార్‌ వాయిస్‌తో విడుదలైన ఈ ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఎన్టీయార్‌ పుట్టినరోజునాడు కొమరం భీమ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలవుతుందని చెప్పారు. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో విడుదల చేయడం సాధ్యం కాలేదు. కాగా తన తాజా ఇంటర్వ్యూలో ఎన్టీయార్‌ ఫస్ట్‌లుక్‌పై రాజమౌళి స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ తిరిగి మొదలైన పది రోజుల తర్వాత తారక్‌ లుక్‌ విడుదల చేస్తామని చెప్పారు. దీంతో సినీ అభిమానులంతా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ఎప్పుడు మొదలౌతుందా అని ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.