ఆర్మీ చేతికి అర్జున్ యుద్ధట్యాంకులు
హ్యాండోవర్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
చెన్నై: అర్జున్ ఎంబీటీ (మెయిన్ బ్యాటిల్ ట్యాంక్) ఎంకే-1ఎయుద్ధట్యాంకులను భారత ఆర్మీకి ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం అప్పగించారు. డీఆర్డీవో చీఫ్ సతీశ్‌రెడ్డి అర్జున్ యుద్ధట్యాంకు నమూనాను ప్రధానికి అందించగా.. ప్రధాని తన చేతుల మీదుగా దాన్ని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణెకు అందజేశారు.
ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భారత రక్షణశాఖ మొత్తం 118 అర్జున్ ఎంకే-1ఎ యుద్ధ ట్యాంకులను ఆర్మీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వాటి తయారీ కోసం మొత్తం రూ.8,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, ఉదయం 10.35 గంటలకు ప్రత్యేక విమానంలో తమిళనాడులోని చెన్నైకి ప్రధాని చేరుకున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని మోదీ ఆర్జున్ యుద్ధట్యాంకును ఆర్మీకి అందజేశారు. ఆ తర్వాత తమిళనాడులో పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. కొత్తవాటికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడిన ప్రధాని.. ఫిబ్రవరి 14వ తేదీని ఏ భారతీయుడు మరిచిపోడన్నారు. సరిగ్గా రెండేండ్ల క్రితం ఇదే రోజున పుల్వామాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడిచేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారని ప్రధాని గుర్తుచేశారు.
Chennai: Prime Minister Narendra Modi formally hands over the DRDO developed Arjun Main Battle Tank (MK-1A) to Indian Army Chief General MM Naravane
DRDO Chairman G Satheesh Reddy presented the model of MK-1A to PM Modi who handed it over to the Army Chief pic.twitter.com/6a6VEYg3sb
— ANI (@ANI) February 14, 2021