ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి అభినందనలు తెలిపిన సీతక్క‌

హైద‌రాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం పై తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్‌ రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొమురం భీం జయంతి సందర్భంగా చిత్ర యూనిట్‌ ఎన్టీఆర్‌పై ఓ టీజర్‌ను విడుదల చేసింది. రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఇచ్చిన ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో ఒదిగిపోయాడు.

ఈ టీజర్‌పై పెద్ద ఎత్తున ప‌లువురు ప్రశంసలు వస్తున్నాయి. సినీ అభిమానులు, ప్ర‌ముఖులే కాకుండా రాజ‌కీయ నాయకులు కూడా చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం ట్విటర్‌ వేదికగా కొమురం భీం పాత్రపై విడుదల చేసిన టీజర్‌ను జోడిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంకు అభినందనలు తెలిపారు.‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ట్వీట్ పోస్టు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.