ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా: తమన్నా

కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఆమె తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ.. సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. సెట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటీకి దురదృష్టవశాత్తు కరోనా బారిన పడినట్లు ఆమె పేర్కొంది. గత వారం తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్ తేలిందని తెలిపింది. దీంతో వైద్యులు సలహాతో గత వారం హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరానని చెప్పింది.
(తప్పక చదవండిః తమన్నాకు కరోనా పాజిటివ్)
సెట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, దురదృష్టవశాత్తూ.. నేను గత వారం తేలికపాటి జ్వరానికి లోనయ్యానని తెలిపారు. ఆ తర్వాత టెస్ట్లు చేస్తే.. కోవిడ్ 19 పాజిటివ్ నిర్థారణ అయిందని, నా ఆరోగ్య సమస్యను ఎదుర్కొనేందుకు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానని తెలిపారు. ట్రీట్మెంట్ అనంతరం.. డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యానని వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటానని తెలిపింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే పూర్తిగా కోలుకోని షూటింగ్కు వెళ్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఇటీవల తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడికోలుకున్న సంగతి తెలిసిందే.