ఆ పాటకు పుష్పాంజలి
బాలు బౌతికంగా మనకు లేక పోవచ్చు . కానీ ఆయన గళం నిరంతరం మన వెంటే ఉంటుంది. కవులు, గాయకులకు మరణం ఉండదు.. వ్యక్తిగతంగా అభిమాను లెవ్వరు కలిసి వుంద లేక పోవచ్చు .. కానీ అయన గళాన్ని వినని ఆరాధించని తెలుగు వారు ఉండరంటే అతి శయోక్తి కాదు. పాటలు సంగీతాభిమానులను మైలు రాళ్లుగా ఉంటాయి.. కళ్ళు మూసుకుని ఒక పాట వింటే మనలను అది గతం లోకి తీసుకు పోతుంది. అది విన్ననాటి సంఘటనలు గుర్తు చేస్తుంది.. ఒక ఘంటసాల , మరో పి . బి. శ్రీనివాస్, ఎ . యం రాజా, బాలమురళి కృష్ణ, ఎం. ఎస్. సుబ్బలక్ష్మి..వీరంతా మన మధ్య లేక పోవచ్చు కానీ వారి గళం ఇప్పటికి మనకు కావలసినప్పుడు పలకరిస్తుంది.. మనలను ఓదారుస్తుంది. బాధలనుంచి బయట పడేస్తుంది.. ఆనందాన్ని పంచుతుంది. బాలు తెలుగు వాడే కావచ్చు.. కానీ మనకంటే ఎక్కువగా తమిళులు, మలయాళీలు, కన్నడీగులు, హిందీ వారు అక్కున చేర్చుకున్నారు.. తమ వారీగా భావిస్తారు.. అంతటి అదృష్టం ఎందరికి కలుగుతుంది.. అతడు ఒక పాటల ప్రేమికుడు. ఆరాధకుడు.. అందుకే ఆయన కృషి ఫలించింది. పాటలో ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు.. పాటలపై అధ్యయనం చేయడం వల్లనే.. అందరికి సలహాలు ఇస్తూ.. ఎందరికో చేయూత నిచ్చారు.. ఇప్పుడు అందరి శ్వాసలో, ధ్యాసలో తన పాట ద్వారా నిలిచి పోయారు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యం లో అయన పాటలను మనం నిరంతరం చూసే అవకాశమూ వుంది.. ఇది బాలుకు అక్షర పుష్పాల నివాళి. ..
-టి.వేదాంత సూరి