ఇఎస్‌ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6552 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈఎస్‌ఐసీ (ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ ఈ మార్చి నెలాఖరులోగాని, ఏప్రిల్‌ నెలలోగాని ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.

ఎంపిక విధానం: రాతీ పరీక్ష ద్వారా. దీంతోపాటు స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో 10 నిమిషాల్లో నిమిషానికి 80 పదాలు టైప్‌ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.

ఖాళీల వివ‌రాలు..
6306 అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ) లేదా అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ క్యాషియర్‌ పోస్టులు
246 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.
అర్హతలు: స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు ఇంటర్‌ పాసైన వారు,
క్లర్క్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వ‌య‌స్సు: 18 నుంచి 27 ఏండ్లలోపు వారై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

Leave A Reply

Your email address will not be published.