ఇషాన్ నాకు పోటీగా మారాడు: సోనూసూద్
ఢిల్లీ : కరోనాకి ముందు సోనీ సూద్ ఒక నటుడుగానే తేలుసు.. ఇప్పుడు దేశమంతా సోనూ సూద్ రియల్ హీరోగా తెలుసు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా కష్టంలో ఉన్నామని మెస్సేజ్ చేస్తే క్షణాల్లో స్పందించి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా సోనూ తన కొడుకు ఇషాన్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రోబ్యాక్ ఫోటో ఒకటి షేర్ చేశాడు. కొడుకు ఇషాన్‌తో కలిసి బాడీ ఫిట్నెస్ చూసిస్తున్న సోనూసూద్ ఆ ఫోటోలో కనిపిస్తాడు.
దీనికి క్యాప్షన్ జత చేస్తూ..’ హ్యాపీ బర్త్‌డే.. ఇషాన్ సూద్.. బాడీ ఫిట్‌నెస్‌లో నాకు పోటీగా మారావు. కంగ్రాట్స్.. అంటూ తెలిపాడు. సోనూ షేర్ చేసిన ఫోటో ఇషాన్ ఐదేళ్ల వయసున్నప్పడిది.. ఇప్పుడు ఇషాన్ టీనేజ్ వయసులోకి అడుగుపెట్టాడు. బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ఇషాన్ తండ్రితో కలిసి సమానంగా వర్కవుట్స్ చేస్తూ పోటీగా తయారయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఉంచాడు సోనూ. సోనూసూద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.