ఉచిత తాగునీటి పథకం నేడే ప్రారంభం

హైదరాబాద్:: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామి మేరకు ప్రతి ఇంటికి 20 వేల లీటర్లలోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్రీ వాటర్ నీటిని పొందే వినియోగదారులు నల్లా కనెక్షన్, క్యాన్ నంబరు (క్యాన్) ఆధార్ నెంబరు లింకు చేయడంతో పాటు నల్లాకు నీటి మీటర్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేటగిరీల వారీగా గైడ్‌లైన్స్‌లను జారీ చేసిన సర్కారు ఇందుకు మీ సేవా కేంద్రాలు లేదా WWW.HMWSSB. COM వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా నల్లాలకు మార్చి 31లోగా విధిగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం జలమండలి ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించారు. అలా ఏర్పాటు చేసుకున్న వారికి 20 వేల లోపు నీటి వినియోగం ఉంటే నీటి సరఫరా ఉచితంగా ఉంటుంది.
ప్రతి ఇంటికి 2 0వేల లీటర్ల లోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రహ్మత్‌నగర్‌లోని ఎస్పీఆర్ హిల్స్‌లో ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.