ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చలి

హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతకొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ లో చలి వణికిస్తోంది. అక్కడి ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల గల ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుదలతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి. అర్లీ టీలో 6.8 , గిన్నెదరిలో సైతం 6.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రెండు రోజులుగా సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా చలి చంపేస్తోంది.
ఉదయం 9 దాటినా చలి తగ్గడంలేదు. సాయంత్రం నాలుగైతే చాలు చాలిగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లో పనులకోసం వెల్లే వారు చలితో నరకం చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రికార్డ్ స్థాయిలో కనిష్ణఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా ఫోర్ కాస్ట్ సైతం ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పుతున్నారు. అర్లీటీ, బేలా, సిర్పూర్ యూ, సొనాల, అలాగే తిర్యాణి మండలంలోని గిన్నెదరి, నిర్మల్ జిల్లాలో, అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ణ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం సాయంత్ర వేళల్లో ఎక్కడ చూసినా చలిమంటలే దర్శనమిస్తున్నాయి. ఇక రాత్రి అయితే చాలు మంచు కురుస్తు చలి తీవ్రతను మరింత పెంచుతోంది.