ఎన్నికల తర్వాతే వరద సహాయం: హైకోర్టు

హైదరాబాద్: హైదరాబాద్లో వరదసాయం గ్రేటర్ ఎన్నిల తర్వాత కంటిన్యూ చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. వరదసాయం కొనసాగించాలనే పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ శరత్ కోర్టులో తన వాదనలు వినిపించగా.. ప్రభుత్వం కూడా వాస్తవ పరిస్థితిని వివరించింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత.. ఎన్నికల ప్రక్రియ ముగిసినా తర్వాత వరదసాయం కంటిన్యూ చేయాలని ధర్మాసనం వెల్లడించింది. వరద సహాయం కొనసాగింపుపై స్టే ఇవ్వలేమన్నది హైకోర్టు. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.
ప్రభుత్వంతో చర్చించకుండా వరద బాధితులకు రూ.10,000 సహాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ శరత్ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వంకు ఎలక్షన్స్ ఉన్నాయని ముందుగానే తెలుసా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అకౌంట్ లో డబ్బులు ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. వరద బాధితుల కిచ్చే సహాయం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద రాదని చెప్పి 25 గంటలలో ఎలక్షన్ కమిషన్ మాట మార్చారని పిటిషనర్ శరత్ తెలిపారు.
ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర బాడీ నా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలా అని ప్రశ్నించింది హైకోర్టు. అలాంటప్పుడు ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించాలని ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది హైకోర్టు. బాధితుల సహాయం ఆపకూడదని ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉందా..? అని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా వర్తిస్తుందని హైకోర్ట్ తెలిపింది.
ఎలక్షన్ కంటే ముందే వరద బాధితుల సహాయ పథకం అమలులో వచ్చిందన్నారు పిటిషనర్ శరత్.. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపడం పొలిటికల్ ఎజెండా అవుతుందని కోర్టుకు తెలిపాడు పిటిషనర్ శరత్.. డిస్ట్రిబ్యూషన్ అఫ్ ఫండ్ కొంతమంది పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని, కాబట్టి పథకాన్ని ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. పథకం మిస్ యూస్ అవుతుందని కోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇది కేవలం ఎన్నికల జరిగేంత వరకే అపామని తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని కోర్టుకు కమిషన్ తెలిపింది. ఈ సహాయం చేయడం వలన ఓటర్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఎన్నికల కమిషన్ భావించింది.
గత నెల 20న ప్రారంభమైన ఈ పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదన్నది ఎన్నికల కమిషన్.. వెల్ఫేర్ స్కీం కేవలం జిహెచ్ఎంసీ వరకే పరిమితమా లేక మొత్తం రాష్ట్రానికి కూడానా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ వచ్చే నెల 4 కౌంటర్ దాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలంది హైకోర్టు.. 4వ తారీకు తర్వాత డబ్బుల పంపించేయొచ్చనని తెలిపింది హైకోర్ట్. తదుపరి విచారణను వచ్చే నెల 4 కు వాయిదా వేసింది హైకోర్టు.