ఎన్నికలున్న రాష్ట్రాలు లక్ష్యంగా వరాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఈ సంవత్సరం జరగునున్న వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల నేపథ్యంలో తీసుకువస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు లక్ష్యంగా ఆ రాష్ట్రాల్లో మౌళిక సదుపాయల ప్రాజెక్ట్‌కు అధికంగా నిధులు కేటాయించారు.
రాష్ట్రాలకు కేటాయింపుల్లో ముఖ్యాంశాలు
- తమిళనాడులో 3500 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ
- ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.110 లక్షల కోట్లు
- 2023 నాటికల్లా రైేల్వే లైన్ల విద్యుద్దీపకరణ పూర్తి
- మెట్రో నెట్ వర్క్ అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు
- కొచ్చి, చెన్నై, నాగ్‌పూర్, బెంగళూరు మెట్రో విస్తరణకు నిధులు
- విజయవాడ, ఖరగ్‌పూర్ మధ్య ఈస్ట్‌కోస్ట్ సరుకు రవాణా కారిడార్
- ఇటార్సీ, విజయవాడ మధ్య నార్త్ఈస్ట్ సరుకు రవాణా కారిడార్
- భారత్ మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి
- అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి
- కేరళలో 1100 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి
- కేరళకు రూ. 65 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- బెంగాల్లో 95 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
తమిళనాడులో రోడ్ల అభివృద్ధి కోసం బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. లక్ష కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధితోపాటు లక్షా 18 వేల కి.మీ మేర రైల్వేలైన్ల అభివృద్ధికి కేటాయింపులు జరిపింది. అలాగే తమిళనాడు బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు నిధులను సమకూర్చింది. మరోవైపు ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్‌పై సైతం కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. బెంగాల్లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధికి తాజా బడ్జెట్లో నిధుల కేటాయింప జరిపింది. మొత్తం ఆ రాష్ట్రానికి దాదాపు రూ.95 వేల కోట్ల వరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. అసోం, పశ్చిమబెంగాల్, కేరళలో ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నది. దీనికి రూ.5 వేల కోట్లు వెచ్చించనుంది. అలాగే 11 వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. కేరళకు సైతం నిధులు భాగానే వడ్డించింది. కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి రూ.1957 కోట్ల కేటాయింపులు జరిపింది. దాదాపు 65 వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది.