ఎన్‌టిఎ మార్గదర్శ‌కాలకు అనుగణంగా పరీక్షలు : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ :కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో నీట్‌, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ స్పష్టం చేశారు. జెఇఇ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిన్‌ కార్డులకు గానూ 7.5 లక్షల అడ్మిన్‌ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఎన్‌టిఎ డిజి తనతో చెప్పారని వెల్లడించారు. నీట్‌ పరీక్షకు సంబంధించి 15.97 లక్షల అభ్యర్థులకు గానూ 10 లక్షల మందికిపైగా అడ్మిన్‌ కార్డులను 24 గంటల్లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోందని మంత్రి వెల్లడించారు. కోవిడ్‌ నేపథ్యంలో జెఇఇ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్‌ పరీక్ష కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచినట్లు చెప్పారు. విద్యార్థుల ఎంపిక ప్రకారమే వారికి పరీక్ష కేంద్రాన్ని కేటాయించే అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్‌టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని వివరించారు. ఇక జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  (విద్యార్థుల భవిత‌కే ముప్పు: విద్యావేత్తలు)

Leave A Reply

Your email address will not be published.