ఎపిలో కొత్తగా 6,133 కేసులు..
48 మరణాలు నమోదు!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,608 నమూనాలను పరీక్షించగా అందులో 6,133 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,93,484కు చేరింది. అదే సమయంలో 48 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణాల సంఖ్య 5,828కి చేరింది. ఇప్పటి వరకు 6,29,211 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 58,445 మంది వివిధ ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఎపిలో ఇప్పటి వరకు 48,06,558 నమూనాలను పరీక్షించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వివరాలను వెల్లడించింది.
మరణాలు
చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, గుంటూరు 4, పశ్చిమగోదావరి 4, కడప 3 కర్నూలు 2, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య5828కి చేరింది.