ఎపిలో కొత్తగా 9,536 కేసులు.. 66 మరణాలు నమోదు!

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో 72,233 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,536 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా బారినపడిన వారి సంఖ్య 5,67,123కు చేరింది. వీరిలో 4,67,139 మంది కోలుకోగా 95,072 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,414 మందికి, పశ్చిమ గోదావరిలో 1,076 మందికి కరోనా సోకింది. అలాగే 66 మంది మృతి చెందారు. అనంత‌పురం జిల్లాలో 7 మంది, నెల్లూరు 7, క‌డ‌ప 6, విశాఖ‌ప‌ట్నం 6, చిత్తూరు 5, తూర్పుగోదావ‌రి 5, కృష్ణా 5,క‌ర్నూలు 5, గుంటూరు 4, విజ‌య‌న‌గ‌రం 4, ప‌శ్చిమ‌గోదావ‌రి 3, శ్రీ‌కాకుళంలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 4,912కు చేరింది. గడిచిన 24 గంటల్లో 10,131 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 45,99,826 పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌న్‌ విడుదల చేసింది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.