ఎపిలో 7,228 కేసులు.. 45 మరణాలు నమోదు!
అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 6,46,530కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం 70,357 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 5,70,667 మంది కోలుకున్నారు. ఎపిలో ఇప్పటివరకు 50.02 లక్షల కరోనా టెస్టులు చేశారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 45 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,506కు చేరుకుంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు, కష్ణా 5, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతిచెందారు. బుధవారం కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1112, పశ్చిమగోదావరి జిల్లాలో 962, గుంటూరు జిల్లాలో 648 కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.
24 గంటల వ్యవధిలో 8291 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 70357 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 570667 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5302367 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
