ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం
నల్లగొండ: నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలిచారు. దీంతో రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోరులో రెండు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ పోరులు సురభి వాణీదేవి బిజెపి అభ్యర్థి రాంచందర్రావుపై రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచారు.
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానంలో మొత్తం 71 మంది బరిలో నిలిచారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లు ఉండగా 3,87,969 ఓట్లు పోలైనవి. వీటిలో 3,66,333 చెల్లినవి కాగా, 21,636 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.
